హైదరాబాద్ అంబర్‌పేట మూసారాంబాగ్‌లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ గోదాములో శుక్రవారం సాయంత్రం డీసీపీ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (Maoist Leader RK) జీవిత చరిత్ర (Maoist Leader RK biography)ను పుస్తక రూపంలో ముద్రిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. వెయ్యి పుస్తకాలు (Maoist Leader RK biography) స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజాభద్రత చట్టం మేరకు సుమోటోగా కేసు నమోదు చేశామని మలక్‌పేట పోలీసులు తెలిపారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. నేరం రుజువైతే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని రామకృష్ణారెడ్డి భార్య, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు సంధ్య ఆరోపించారు. ఆర్కే భార్య (Maoist Leader RK Wife) శిరీష కోరిక మేరకు తానే పుస్తక ప్రచురణకు (Maoist Leader RK biography) ఒప్పుకున్నానని చెప్పారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నారని చెప్పినా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త స్మృతులతో భార్య పుస్తకం రాసుకుంటే అది నిషేదం ఎలా అవుతుంది? ఒక ఇన్ ప్రింట్‌తో వేసుకున్నప్పుడు అది రహస్యంగా వేసుకున్నది కాదు. ప్రచురణ కర్త శిరీష అని ఉంది ఇక్కడ. మాకు వచ్చిన ఆర్డర్లు, రాబోయే ఆర్డర్లు అన్ని తీసుకుని వెళ్లిపోయారు. నా భర్త ఆరోగ్యం అసలు బాగాలేదు. సీరియస్ కండీషన్లో ఉన్న అతనిని తీసుకెళ్లిపోయారు.
సంధ్య, పీఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు
తన భర్త జ్ఞాపకాలను పుస్తక రూపం (Maoist Leader RK biography)లో తీసుకొస్తే అడ్డుకోవడం సరికాదని ఆర్కే భార్య (Maoist Leader RK Wife) శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.