Police rescue man from sea: బాపట్ల జిల్లా చీరాల వాడరేవు దగ్గర సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని తీరప్రాంత సిబ్బంది రక్షించారు. వారాంతపు సెలవులు కావడంతో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు.. అనేక ప్రదేశాలు తిరుగుతూ వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి వచ్చారు. బుద్ధ రిసార్ట్ సమీపంలో సరదాగా స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. ఒక్కసారిగా అలల తాకిడి పెరిగింది. దీంతో శివ (22) అనే యువకుడు నీళ్లలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తీరప్రాంత సిబ్బంది.. ఆ యువకుడిని రక్షించారు. సముద్రంలోకి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
సముద్రంలో కొట్టుకుపోయిన యువకుడు, రక్షించిన పోలీసులు - bapatla district
Police rescue man వారాంతపు సెలవులు కావడంతో హైదరాబాద్కు చెందిన యువకులు వివిధ ప్రదేశాలు పర్యటిస్తూ చీరాల వాడరేవుకు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. అలల తాకిడి పెరగడంతో శివ అనే యువకుడు నీళ్లలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తీర ప్రాంత సిబ్బంది అతడిని రక్షించారు.
యువకుడిని కాపాడి తీరంపు రక్షణ పోలీసులు