Remand Report on Minister Murder Conspiracy case: తెలంగాణమంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అతడి అనుచరుడు హైదర్ అలీని అమరేందర్ రాజు సోదరులు హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఫరూఖ్‌ను సంప్రదించటం..
మంత్రిని హత్య చేయడం కోసం తుపాకులు సమకూర్చుకోవడానికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన ఫరూఖ్‌ను అమరేందర్ రాజు సోదరులు సంప్రదించారు. గతేడాది నవంబర్ 18న ఫరూఖ్ ఓ ఎక్సైజ్ కేసులో భాగంగా మహబూబ్‌నగర్ కోర్టుకు వచ్చాడు. అమరేందర్ రాజు చిన్న సోదరుడు నాగరాజు.. ఫరూఖ్‌ను కలిసి తుపాకుల గురించి అడిగాడు. హైదర్‌తో పాటు అతడి రాజకీయ గురువు శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయడానికి తుపాకులు ఇప్పించాల్సిందిగా కోరారు. ఫరూఖ్ ఈ విషయాన్ని హైదర్ అలీకి తెలిపాడు.
అందరినీ అరెస్ట్ చేయటం..
కుట్ర విషయాన్ని బయటపెట్టిన ఫరూఖ్‌తో పాటు హైదర్ అలీని చంపేందుకు నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య ప్రయత్నించి పేట్‌బషీరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. గత నెల 27నే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు విషయం బయటపడటంతో.. పరారీలో ఉన్న రాఘవేందర్ రాజు, మధుసూదన్ రాజు, మున్నూరు రవి.. దిల్లీలోని జితేందర్ రెడ్డికి చెందిన అతిథి గృహంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపర్చి హైదరాబాద్ తీసుకొచ్చారు. మైలార్దేవ్ పల్లిలోని ప్రగతినగర్‌లో ఉన్న అమరేందర్ రాజును అరెస్ట్ చేశారు.