అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు చేపట్టారు. ఆరుగురు ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ... గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఐ, ఆర్‌ఐలకు ఛార్జి మెమోలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు.
నరసరావుపేట ఉపకారాగారం నుంచి 43 మంది ఖైదీలను తరలించామన్న ఎస్పీ...వారిలో ఏడుగురు అమరావతి రైతులు ఉన్నట్లు చెప్పారు. ఖైదీలందరితో పాటు వారికి కూడా సంకెళ్లు వేశారని చెప్పారు.