ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటింగ్​లో ముందున్న పోలీస్​బాసులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసు ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/krishna/a-cctv-footage-has-emerged-of-an-incident-in-which-a-man-attacked-ap-transport-minister-perni-nani-with-a-masonry/ap20201201140250927
https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/krishna/a-cctv-footage-has-emerged-of-an-incident-in-which-a-man-attacked-ap-transport-minister-perni-nani-with-a-masonry/ap20201201140250927

By

Published : Dec 1, 2020, 3:48 PM IST

ఓటింగ్​లో ముందున్న పోలీస్​బాస్​లు

ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓటర్లకు సూచించారు. కుందన్​బాగ్ చిన్మయ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన సతీ సమేతంగా ఓటు వేశారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఓటేశారు.

అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ తమ ఓటు హక్కును వినియోగించున్నారు. కొవిడ్‌కు భయపడకుండా నగర ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఐడీ డీఐజీ సుమతి, మాజీ విశ్రాంత పోలీసు అధికారి ఎకే ఖాన్, పలువురు ఐఏఎస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details