Pipeline works: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లెలో ప్రజల విరాళాలతో నిర్మించుకుంటున్న మురుగు నీటి కాల్వను పోలీసులు అడ్డుకున్నారు. కాల్వ పనులు చేస్తున్న వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వర్షం కురిస్తే మురుగు నీరు నిలిచిపోయి ఇళ్లల్లోకి వస్తున్న మురుగు నీరు మళ్లించేందుకు పైప్‌లైన్ వేయడానికి స్థానికులు లక్షరూపాయల విరాళాలు సేకరించారు. పనులు పూర్తి కావటానికి అవసరమైన మరికొంత సొమ్మును సర్పంచి మహేష్‌తోపాటు తెలుగుదేశం నేత చింబలి వెంకటరమణ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ పనులు ప్రారంభిస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడానికి వీల్లేదంటూ స్టేషన్‌కు తరలించారు. వైకాపా నేతలే పనులు అడ్డగించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pipeline works: మురుగు నీటి పైప్‌లైన్ పనులను అడ్డుకున్న పోలీసులు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
Pipeline works: అనంతపురం జిల్లాలో ప్రజలు విరాళాలతో నిర్మించుకుంటున్న మురుగు నీటి పైప్‌లైన్ పనులను పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ ఉదయం మురుగు పారుదల పనులు చేస్తుండగా తాడిపత్రి పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా నాయకులు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మురుగు నీటి పైప్‌లైన్ పనులు