అమరావతి ఉద్యమంలో పాల్గొనకుండా ఇంటర్ విద్యార్థికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అతణ్ని గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడకు చెందిన పొట్లూరి దర్శిత్... అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. అమరావతి ఐకాస విద్యార్థి విభాగంలో కన్వీనర్‌గానూ ఉన్నాడు. 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి ఐకాస నిరసనలకు పిలుపునివ్వటంతో... ఉదయం దర్శిత్ నివాసానికి వెళ్లిన పటమట పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అతని ఇంటి బయట మఫ్టీలో కాపలా ఉన్నారు.
ఇంటర్ విద్యార్థికి పోలీసుల నోటీసులు... ఎందుకంటే.. - Amaravathi agitation latest news
ఓ ఇంటర్ విద్యార్థికి పోలీసులు నోటీసులు ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకు నోటీసులు ఇచ్చారు. అతని ఇంటి బయట మఫ్టీలో పోలీసులు పహరా కాస్తున్నారు.
Police notices to inter student