రేపు అమరావతిలో జరిగే మంత్రిమండలి భేటీ సందర్భంగా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. కొత్త వ్యక్తులు వస్తే తమకు చెప్పాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మంత్రిమండలి భేటీ జరిగే రోజున నిరసనలకు అనుమతి నిరాకరించారు.
రేపు రైతుల ఇళ్లలో కొత్త వ్యక్తులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఉంటే తమకు తెలియచేయాలన్నారు. మంత్రిమండలి నేపథ్యంలో రైతులకు నోటీసులు ఇచ్చామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో నిరసనలకు అనుమతి లేదన్న డీఎస్పీ... మంత్రిమండలి భేటీ సచివాలయంలోనే జరిగే అవకాశం ఉందన్నారు.