రక్తదానాలు.. మెడికల్ క్యాంపులు @ పోలీసుల వారోత్సవాలు - రాష్ట్రంలో పోలీసుల అమరవీరుల దినోత్సవాలు
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా.. నిర్వహిస్తున్న వారోత్సవాలు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఓపెన్‌హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించారు.
పోలీసుల అమరవీరుల దినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రక్తదాన శిబిరాలు, వైద్య సేవల క్యాంపులతో పోలీసులు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా.. ప్రజలకు కావలసిన అవసరాలను గుర్తించి.. సమస్యలు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ చెప్పారు. అవనిగడ్డలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రక్తదాన శిబిరంతో పాటు... ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు, చిత్తూరు జిల్లా పుత్తూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగిస్తున్నారు.