warangal police at railway station: వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేసిన తీరుగానే ఇవాళ వరంగల్‌లో అందోళనకారులు రైల్వేస్టేషన్ లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అందోళనకారులకు తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
సికింద్రాబాద్ తరహాలో ప్లాన్.. లాఠీఛార్జ్‌తో అడ్డుకున్న పోలీసులు
warangal police at railway station: సికింద్రాబాద్ తరహాలోనే వరంగల్ రైల్వేస్టేషన్‌లోనూ ఆందోళనకు యత్నించిన నిరసనకారులను పోలీసులు సకాలంలో అడ్డుకున్నారు. ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు లాఠీఛార్జ్ చేసి నియంత్రించారు.
సికింద్రాబాద్ తరహాలో ప్లాన్
అనంతరం అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ ఎదుట అందోళనకారులు ధర్నాకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నిన్న సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో పోలీసులు కాల్పులు జరపగా రాకేశ్ అనే యువకుడు మృతి చెందాడు.
ఇవీ చదవండి: