వెలగపూడిలో పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి రైతులు, మహిళలు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులను నెట్టుకుంటూ నిరసనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జాతీయ జెండాలు పట్టుకుని మహిళలు, రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం కానీ... అమరావతి నుంచి రాజధాని తరలనివ్వబోమని తేల్చిచెప్పారు.
రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి - అమరావతి రైతులపై మహిళలపై పోలీసుల లాఠీఛార్జి
![రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి police lathicharge on amaravathi women farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5772621-891-5772621-1579504918708.jpg)
అమరావతి ప్రజలపై పోలీసుల లాఠీఛార్జి
12:15 January 20
అమరావతి ప్రజలపై పోలీసుల లాఠీఛార్జి
సచివాలయం వైపు వెళ్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. సచివాలయం వెనుక వైపునుంచి మహిళలు దూసుకొచ్చారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు రావటంతో గాయాలయ్యాయి. గాయాలతోనే రైతులు, మహిళలు సచివాలయానికి పరుగులు తీశారు. దూసుకొస్తున్న మహిళలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో రైతులు, మహిళలకు గాయాలయ్యాయి.
ఇవీ చదవండి..
Last Updated : Jan 20, 2020, 12:57 PM IST