తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో ప్రధాన నిందితుడు సుమన్ కుమార్ చౌదరి కస్టడీ విచారణ ముగిసింది. రెండు రోజుల కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. అతని ఫోన్లోని వాట్సాప్ ఛాటింగ్‌ను పరిశీలించారు. పలు సందేశాలపై ఆరా తీశారు. ఎక్కడెక్కడ క్యాసినోలను నిర్వహించారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నేడు పోలీసులు.. సుమన్‌ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.
తెలంగాణ : ఫాంహౌస్ పేకాట కేసులో కొనసాగుతున్న విచారణ - రంగారెడ్డి జిల్లా వార్తలు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను పోలీసులు రెండో రోజు విచారించారు. సుమన్ ఇచ్చిన సమాచారంతో.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు.. సుమన్‌ను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.
కస్టడీ సమయంలో హైదరాబాద్ శివారుల్లోని ఫామ్‌హౌస్‌లకు.. అతనికి ఉన్న లింకులపై ప్రశ్నల వర్షం కురింపించారు. పలువురితో అతను తరచూ మాట్లాడుతుండేవాడని గుర్తించారు. గతంలో హైదరాబాద్‌తో పాటు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించారు. జరిగిన లావాదేవీలపై సమాచారం సేకరించారు. పేకాట గురించి పలువురు ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించే వాడని... కొంతమంది అధికారులతోనూ సుమన్‌కు పరిచయాలు ఉన్నాయని విచారణలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసిన సుమన్.. కాంట్రాక్టులు, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాడని కస్టడీలో తేలింది. సుమన్ ఇచ్చిన సమాచారంతో.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: