తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు శనివారం పట్టుకున్నారు. దాడిలో సుమారు రూ.50 వేలు విలువ చేసే 307 క్వార్టర్ల లంగాణ మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని సీఐ ఎస్.వెంకట్రావు వివరించారు. బరంపేట లోని సింధు స్కూల్ సమీపంలో ఒక ఆటోలో తెలంగాణ మద్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేపట్టామని తెలిపారు.
రూ.50 వేలు విలువ చేసే అక్రమ మద్యం పట్టివేత - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని నరసరావుపేటలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.
అక్రమ మద్యం పట్టివేత
తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన సరికొండ సాయిరాజ్, ఆటోడ్రైవర్ షేక్ జాన్ మియాలపై కేసునమోదు చేసి ఆటో సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అల్లుడు ప్రమేయం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. దానిపై కూడా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:Tadepalli rape case: పోలీసులకు సవాలుగా తాడేపల్లి అత్యాచార ఘటన కేసు!