ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Woman Harassment in Khammam : 'ఆమెను మాకు వదిలేసిపొండి'

Woman Harassment in Khammam : తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంట్లో మొదలుకుని పనిచేసే చోట, రోడ్లపై ఇలా ప్రతిచోటా మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్లినప్పుడే కాదు.. మహిళలకు తోడు ఎవరో ఒకరు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో భర్త, సోదరునితో కలిసి ఊరెళ్తున్న ఓ వివాహితతో కొందరు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను తమకు వదిలేసి వెళ్లాలంటూ మహిళ భర్తను, సోదరుణ్ని బెదిరించారు.

Woman Harassment in Khammam
'ఆమెను మాకు వదిలేసిపొండి'

By

Published : Jun 11, 2022, 10:07 AM IST

Woman Harassment in Khammam : తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహితను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో ఏడుగురిపై శుక్రవారం కేసు నమోదైంది. హైదరాబాద్‌ నుంచి పుట్టింటికి వెళ్లేందుకు భర్త, 14నెలల కుమారునితో కలిసి ఆమె ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున బస్సు దిగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించారు. బాధితురాలిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఆమెను తమకు వదిలేసి వెళ్లాలంటూ సోదరుడు, భర్తను బెదిరించారు.

వారి నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వెళ్లిన వెంటనే గ్రామస్థుల సహకారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నగరంలోని ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన ఏడుగురి(వీరిలో ముగ్గురు మైనర్లు)తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details