ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dial 100: భార్య మటన్ కర్రీ వండ లేదని డయల్ 100కు ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..! - charla gouraram

Dial 100 : డయల్ 100కు మనం ఎప్పుడు కాల్ చేస్తాం. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లోనో లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడో. కానీ ఓ వ్యక్తి విచిత్రమైన కారణంతో 100కు డయల్ చేశాడు. పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేశాడు. అతడి ప్రవర్తనతో విసుగెత్తిపోయిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరే ఓసారి చూడండి.

police filed a case on dial 100
భార్య మటన్ కర్రీ వండలేదని డయల్ 100కు ఫోన్

By

Published : Mar 20, 2022, 11:52 AM IST

Dial 100 : మద్యం మత్తు ఓ వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. అలాగని అతను తాగి అల్లరి చేయలేదు. ఎలాంటి వీరంగం సృష్టించలేదు. అయినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Man Called Police For a Silly Reason : హోలీ పండగ రోజున తాను తీసుకువచ్చిన మటన్‌తో తన భార్య కూర వండలేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తెలంగాణ నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని చర్ల గౌరారానికి చెందిన నవీన్. మద్యం మత్తులో అతని భార్య మాంసం వండి పెట్టలేదని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని డయల్‌ 100కు ఆరుసార్లు ఫోన్‌ చేసి పోలీసులను విసిగించాడు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

దీంతో పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నగేశ్‌ తెలిపారు. అత్యవసర సేవలు, ఆపద సమయంలో మాత్రమే 100కు డయల్‌ చేయాలని, అనవసరంగా ఫోన్‌చేసి సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details