మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయకూడదని తెలంగాణ పోలీసులు సికింద్రాబార్ కోర్టును కోరారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణలో భాగంగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ కౌంటర్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలామంది పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు.
'అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు'... కోర్టులో పోలీసుల కౌంటర్ - తెలంగాణ వార్తలు
మాజీ మంత్రి, తెదేపా నేత అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణలోని సికింద్రాబాద్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆమె బెయిల్ మంజూరు చేయకూడదని బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
పోలీసుల కౌంటర్ దాఖలు
అఖిలప్రియ విచారణకు సహకరిస్తారని ఆమె తరఫు న్యాయవాదలు కోర్టుకు చెప్పారు. ఆమె అనారోగ్యానికి గురైన కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అటు భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది.