సీడ్ యాక్సిస్ రోడ్డుపై ధర్నాకు యత్నించిన ఉద్ధండరాయునిపాలెం రైతులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదంటూ బలవంతంగా వెనక్కి పంపించారు. అమరావతిని రాజధానిగా కొనసాగేలా చూడాలని.. న్యాయదేవతకు వెంకటపాలెంలో పూజలు చేశారు. మోకాళ్లపై నిల్చొని నినాదాలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. ఆయా గ్రామాల్లో రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 346వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, ఉద్ధండరాయునిపాలెం, పెదపరిమి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, వెంకటపాలెంలో రైతులు నిరసన తెలిపారు. దీక్షా శిబిరాల వద్ద జైఅమరావతి అంటూ నినాదాలు చేశారు.
సీడ్ యాక్సిస్ రోడ్డుపై అమరావతి రైతుల ధర్నా భగ్నం
గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుపై.. రైతుల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ.. వెంకటపాలెంలో న్యాయదేవతకు మహిళలు పూజలు చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు