ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

house arrest: తెలంగాణలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం - తెలంగాణ రాజకీయలు

అసోం సీఎంపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 7 వందలకు పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

house arrest
house arrest

By

Published : Feb 16, 2022, 11:42 AM IST

Congress Leaders House Arrest : తెలంగాణ వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్ల ముందు ధర్నాలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యనేతలను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అసోం సీఎంపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 7 వందలకు పైగా పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవాళ ధర్నాలు చేపడతామని ప్రకటించారు. అందుకు ప్రతిగా పోలీసులు గృహనిర్బంధాలు చేశారు.

Revanth House Arrest : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టాముట్టారు. ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించి... ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నిజామాబాద్‌లో మధుయాష్కిని, కామారెడ్డికి వెళ్లకుండా షబ్బీర్‌ అలీని అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: NGT On Illegal sand mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సమాధానమివ్వండి...ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details