ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: న్యాయవాద దంపతుల హత్య కేసు నిందితులకు కస్టడీ - Peddapalli lawers murder case updates

తెలంగాణలో సంచలనం రేపిన వామన్​రావు, నాగమణి న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం వారిని వరంగల్ జైలు నుంచి తీసుకెళ్లారు.

police-custody-for-vamanrao-couple-murder-case-accused
తెలంగాణ : న్యాయవాద దంపతుల హత్య కేసు నిందితులకు కస్టడీ

By

Published : Feb 25, 2021, 5:11 PM IST

తెలంగాణలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను వరంగల్ జైలు నుంచి మంథని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వామన్‌రావు హత్య కేసులో వారంరోజుల పాటు ప్రశ్నించి మరిన్ని ఆధారాలు రాబట్టనున్నారు. ఇప్పటికే హత్యకు సంబంధమున్న ముగ్గురు నిందితులకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు.

హత్యకు కత్తులు సమకూర్చింది బిట్టు శ్రీను అని నిర్ధరించుకున్నారు. హత్యకు కారణాలపైనా దర్యాప్తు చేపట్టారు. హత్య సమయంలో వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని నిర్ధరించేందుకు ల్యాబ్‌కు పంపించారు. వారంరోజుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టడంతో పాటు హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

ఇదీ చదవండీ... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

ABOUT THE AUTHOR

...view details