తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని విచారణలో వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. సాక్ష్యాలను మాయం చేసేందుకే కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం పెట్టి నిప్పుపెట్టినట్లు పోలీసులు వివరించారు.
సాంకేతికత సాయంతో..
తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో 4 బృందాలు విచారణ చేపట్టాయి. సాంకేతిక ఆధారాల సాయంతో కేసును ఛేదించారు. వేగంగా కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ చందన దీప్తీ అభినందించారు.
ఏం జరిగింది?
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి శివారులో రోడ్డు పక్కన వ్యాపారి శ్రీనివాస్‌ను సోమవారం రాత్రి దహనం చేశారు. హోండా సిటీ కారు కాలిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కారును పరిశీలించి డిక్కీలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా వ్యాపారి శ్రీనివాస్‌గా గుర్తించారు. నాలుగు బృందాల సాయంతో ఘటనపై విచారణ చేపట్టారు. 24 గంటల్లోనే హత్యకేసును మెదక్ పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని తేల్చారు.
ఇదీ చదవండి:MURDER MYSTERY: భూత వైద్యుడినంటూ లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి