ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2022, 4:02 PM IST

ETV Bharat / city

విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

Passport Police Clearance Certificate: పాస్‌పోర్ట్‌ పొందాలంటే తప్పనిసరిగా పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పొందాల్సిందే. వాటి కోసం రేపటి నుంచి తపాలా కార్యాలయాల్ని అందుబాటులోకి తేవాలని.. కేంద్రం నిర్ణయించింది. తద్వారా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మరింత వేగంగా పూర్తికానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 30 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఆ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Foreign passengers
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/27-September-2022/16483955_73_16483955_1664255738708.png

Passport Police Clearance Certificate: విద్య, ఉపాధి అవకాశాలు, పర్యాటక అవసరాలకు విదేశాలకు వెళ్లేవారి సంఖ్యక్రమంగా పెరుగుతోంది. అలా వెళ్లేవారికి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు (పీసీసీలు) కావాలని పలు దేశాలు అడుగుతుడంటతంతో రోజురోజుకు వాటికి డిమాండ్‌పెరుగుతోంది. ఇప్పటివరకు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల ధరఖాస్తుల పరిశీలన పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో మాత్రమే చేసేవారు. డిమాండ్‌కు తగ్గట్లు పీసీసీల ధరఖాస్తుల పరిశీలన సకాలంలో పూర్తికాకపోవడంతో సెలవురోజుల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి పూర్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు శనివారాలు ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశారు. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకుంటున్న పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల ధరఖాస్తుల పరిశీలనా ప్రక్రియకు పాస్‌పోర్టు కేంద్రాల సామర్థ్యం సరిపోకపోవడం వల్ల స్లాట్‌బుకింగ్‌ ఆలస్యమై దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఎంపిక చేసిన తపాల కార్యాలయాల్లో దరఖాస్తులు పరిశీలన:ఆ సమస్యను అధిగమించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన తపాలా కార్యాలయాలను పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ధరఖాస్తుల పరిశీలనకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. నిర్దేశించిన తపాలా కార్యాలయాల్లో వెరిఫికేషన్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్‌బుకింగ్‌ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా నిర్దేశించిన తపాలా కార్యాలయాలు ధరఖాస్తుల పరిశీలనకు అందుబాటులోకి రానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 30 తపాలా కార్యాలయాలు ఎంపిక: స్లాట్‌బుకింగ్‌ చేసుకున్నవారి ధరఖాస్తులో పొందుపరచిన చిరునామా, పుట్టినతేదీ, ఇతర విషయాలను ఒరిజినల్‌ సర్టిఫికెట్ల ఆధారంగా పరిశీలిస్తారు. వేలిముద్రల సేకరణ, దరఖాస్తుదారుడి ఫోటో అక్కడే తీసుకొని ప్రక్రియ పూర్తిచేసి పాస్‌పోర్టు కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపిస్తారు. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు సిద్దం కాగానే సంబంధిత ధరఖాస్తుదారుడికి స్పీడ్‌పోస్టు ద్వారా పంపిస్తారు.

రెండు తెలుగురాష్ట్రాల్లో దాదాపు 30 ప్రధాన తపాలా కార్యాలయాలు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల ధరఖాస్తుల పరిశీలనకు అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సేవలతో పీసీసీల ధరఖాస్తుల పరిశీలన, స్లాట్‌బుకింగ్‌ కోసం దరఖాస్తుదారులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details