మందడం గ్రామంలో తన తండ్రిని డీఎస్పీ అదుపులోకి తీసుకుంటుండగా అడ్డుపడిన ఆయన కుమార్తె శ్రీలక్ష్మిపై ఓ మహిళా పోలీసు విరుచుకుపడ్డారు. తన తండ్రికి.. డీఎస్పీకి మధ్య అడ్డుగా వెళ్లిన శ్రీలక్ష్మిని మహిళా కానిస్టేబుల్ గట్టిగా పట్టుకుని లాగడంతో.. ఇద్దరూ కింద పడిపోయారు. అలా పడిపోయే సమయంలో శ్రీలక్ష్మి తలకు అక్కడున్న కర్ర తగిలింది. బాధతో విలవిల్లాడుతున్న ఆమెను మహిళా కానిస్టేబుల్ రెండు చేతులతో గట్టిగా పొత్తికడుపు నొక్కి పట్టుకున్నారు. తాను పైకి లేచే ప్రయత్నంలో.. కానిస్టేబుల్ మరోసారి శ్రీలక్ష్మి పొత్తికడుపుపై మోకాలు వేసి అదమడం వల్ల ఆమె కుప్పకూలిపోయారు. ఒకవైపు తలకు తగిలిన దెబ్బ.. మరోసారి పొత్తికడుపులో గాయంతో అల్లాడుతున్న ఆమెను వెంటనే 108 అంబులెన్సులో విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. శ్రీలక్ష్మిని తెదేపా నేతలు పరామర్శించారు.
ఉద్యమకారులపై పోలీసుమార్కు కాఠిన్యం..! - అమరావతి రైతులపై పోలీసుల దాడులు న్యూస్
ఖాకీ కాఠిన్యానికి అద్దంపట్టే దృశ్యమిది. రాజధాని కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనడానికి నిదర్శనమిది.
ఉద్యమకారులపై పోలీసుమార్కు కాఠిన్యం