ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శిరోముండనం కేసు: తీగ లాగితే కదిలిన ఫేక్ ‌కాల్స్ డొంక - నూతన్ నాయుడు

శిరోముండనం కేసులో నిందితులైన కుటుంబసభ్యులను రక్షించుకునేందుకు పెద్ద అధికార్ల పేరుతో ఫోన్ కాల్స్ చేసిన నూతన్ నాయుడు లీలలు పోలీసులను విస్తుపోయేలా చేస్తున్నాయి. దాదాపు ఐదు సిమ్​లతో 3 సెల్ ఫోన్లను వినియోగిస్తున్న అతడు.. గతంలోనూ పలువురికి ఫేక్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 30 మంది అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఇంకా ఎవరినైనా బెదిరించినట్టు ఫిర్యాదులు వస్తే వాటిపైనా లోతుగా విచారణ చేస్తామని విశాఖ సీపీ ప్రకటించారు.

nutan-naidu
nutan-naidu

By

Published : Sep 5, 2020, 4:44 AM IST

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్‌ అనేఎస్సీ యువకుడి శిరోముండనం వ్యవహారంఅంతా నూతన్ నాయుడు కనుసన్నల్లోనే జరిగిందని భావించిన పోలీసులు....తాను ఇంట్లో లేనట్టుగా నమ్మించేందుకు యత్నిస్తున్నాడని గ్రహించారు. నూతన్ నాయుడు భార్య సహా శిరోముండనానికి పాల్పడిన ఏడుగురు అరెస్టైనా....అతడు మాత్రం పరారీలో ఉండడాన్ని అనుమానించి ఒక కన్నేసి ఉంచారు. అదే సమయంలో అరెస్ట్‌ అయిన తన భార్య ను ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉంచేట్టుగా చేయడం కోసం నూతన్‌ కొత్త ఎత్తుగడకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో పలువురు వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్ చేసిన బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి పీవీ రమేశ్‌కు తెలియగా... ఆయన తన పేరుతో ఎవరో ఫేక్‌కాల్స్ చేస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి ఫేక్‌కాల్స్‌ చేస్తున్నది నూతన్ ‌నాయుడేనని తేల్చారు.

ట్రూ కాలర్​లో స్పెషల్​ సీఎస్​గా...

నూతన్‌నాయుడు అంత తేలిగ్గా ఏమీ పోలీసులకు పట్టుబడలేదు. తన భార్య కోసం నూతన్ నాయుడే ఫేక్‌ కాల్‌ చేశాడా అని పరిశీలించినపుడు కూడా అతడి గట్టు బయటపడలేదు. అదే సమయంలో గతంలో గాజువాక సీఐకి వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌ను పరిశీలించారు. సీఐకి ఫోన్‌ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి ఒక వాహనాన్ని విడిచి పెట్టాలని... తాను సీఎం సెక్యూరిటీ వింగ్ లో వ్యక్తిని మాట్లాడుతున్నట్టుగా వచ్చిన నెంబర్‌ తో ఈ నెంబర్ సరిపోల్చడంతో పోలీసుల దృష్టి నూతన్ నాయుడుపైకి మళ్లింది. శిరో ముండనం కేసులో ప్రధాన నిందితురాలిని ఆసుపత్రిలో ఉంచేందుకు చేసిన ఫేక్ కాల్స్ తో సరిపోల్చారు. అదే నెంబర్​గా నిర్ధారించుకున్నారు. ఒక నెంబర్ నుంచి ట్రూకాలర్ లో కూడా స్పెషల్ సీఎస్ గా వచ్చేట్టుగా సాప్టువేర్ ను రూపొందించి టెక్నాలజీని తనకు అనుగుణంగా వినియోగం కోసం ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు.

పోలీసుల ప్రత్యేక ఆపరేషన్...

తొలుత హైదరాబాద్ నుంచి ఫేక్‌ కాల్స్ వస్తే తర్వాత కర్ణాటక నుంచి వచ్చినట్టుగా ధ్రువీకరించుకొని... పోలీసులు వేట ప్రారంభించారు. కర్ణాటక పోలీసులు సాంకేతిక సాయం తీసుకున్నారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తన బృందాలకు ఈ అంశంపై ఇచ్చిన మార్గదర్శకాలు ఫలించాయి. ఉడిపి వద్ద రైల్లో ప్రయాణిస్తున్న నూతన్ నాయుడుని అదుపులోకి తీసుకుని అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఇప్పుడు నూతన్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఫేక్ కాల్స్ తో ప్రభావితం చేసేందుకు యత్నించినందుకు మరో కేసు నమోదు చేశారు.

శ్రీకాంత్‌కి శిరోముండనం చేస్తున్న సమయంలో నూతన్‌నాయుడి భార్య , ఇంట్లోని సిబ్బంది ఎవరికో వీడియో కాల్‌ చేసినట్లు సీసీ కెమెరా పుటేజీలో నమోదైంది. వారు నూతన్‌నాయుడుతోనే మాట్లాడినట్లు పోలీసులు తేల్చారు. నూతన్ నాయుడు ను ఆదివారం విశాఖకు తీసుకువచ్చే అవకాశం ఉంది. జుడీషియల్ రిమాండ్ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు.

ఇదీ చదవండి

చితకబాదారు... శిరోముండనం చేశారు!

ABOUT THE AUTHOR

...view details