ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chain Snatcher Arrest: సింగం-3 సీన్​ రిపీట్​.. విమానంలో ఉన్న గొలుసుదొంగ అరెస్ట్​.. - Chain Snatcher arrest in Flight

Chain Snatcher Arrest: సింగం-3(S-III) సినిమా చూశారా..? అందులో.. విమానంలో పారిపోతున్న విలన్​ను హీరో అరెస్ట్​ చేసే సీన్​.. గుర్తుందా..? అచ్చం అలాంటి సన్నివేశమే.. తెలంగాణలోని శంషాబాద్​ ఎయిర్​పోర్టులోనూ చోటుచేసుకుంది. అయితే.. సినిమాలో విలన్​ పెద్ద స్మగ్లర్​.. కానీ.. ఇక్కడ అరెస్టయింది ఓ గొలుసు దొంగ.. మిగతాదంతా సేమ్​ టూ సేమ్​. కేవలం ఒక గొలుసు దొంగ విమానంలో ప్రయాణించటమేంటీ..? అతడిని పోలీసులు చేజ్​ చేసి.. ఎయిర్​పోర్ట్​లో అరెస్ట్​ చేయటమేంటీ..? అసలు కథంటంటే..?

Chain Snatcher Arrest
Chain Snatcher Arrest

By

Published : Mar 30, 2022, 8:53 PM IST

Chain Snatcher Arrest: తెలంగాణ రాజధాని హైదరాబాద్​ శివారులోని అబ్దుల్లాపూర్​మెట్​ పీఎస్​ పరిధిలో నిన్న(మార్చి 29) సాయంత్రం ఓ గొలుసు దొంగతనం జరిగింది. కమల అనే మహిళ మెడలో నుంచి ఓ దొంగ.. బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన కమల తలకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేంతికతను ఉపయోగించిన పోలీసులు.. నిందితుని వివరాలు కనుగొన్నారు. ఇక్కడి నుంచి.. సింగం-3(S-III) సినిమాలోని సన్నివేశమే రిపీట్​ అయ్యింది.

నిందితుడు ఉత్తరప్రదేశ్​కు చెందిన హేమంత్​గా గుర్తించారు. టెక్నాలజీ సాయంతో నిందింతుడు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దిల్లీ పారిపోతున్నట్టు తెలియడంతో.. వెంటనే ఆర్జీఐ ఎయిర్​పోర్టు పీఎస్​ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈరోజు(మార్చి 30) ఉదయం 5 గంటలకు సమాచారం అందుకున్న ఔట్​పోస్ట్​ పోలీసులు.. శంషాబాద్​ విమానాశ్రయ భద్రతా సిబ్బందితో కలిసి అంతా గాలించారు. చివరికి.. దిల్లీ వెళ్లే జెట్​ఎయిర్​వేస్​ విమానంలో నిందితుడు ఉన్నట్టు గుర్తించారు. రన్​వేపై ఉన్న విమానం దగ్గరికి వెళ్లి.. నిందితున్ని అదుపులోకి తీసుకుని రాచకొండ పోలీసులకు అప్పజెప్పారు. అతడి దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

Chain Snatcher Arrest

అయితే.. ఉత్తరప్రదేశ్​కు చెందిన హేమంత్ దిల్లీలో నివాసం ఉంటున్నాడు. గొలుసు దొంగతనాలు చేయటం అతడికి అలవాటు. అయితే.. ఆ దొంగతనాలు మాత్రం కేవలం మెట్రోనగరాల్లో చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హేమంత్​పై ఇప్పటివరకు మొత్తం ఆరు కేసులున్నాయి. మరో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే.. గొలుసు దొంగతనాలు చేసేందుకు హేమంత్​.. విమానాల్లోనే రాకపోకలు కొనసాగిస్తుంటాడట..! ఈ విలాసవంతమైన గొలుసుదొంగను పట్టుకోవడంలో సఫలీకృతమైన సింగాలు అదేనండి కానిస్టేబుళ్లు.. శ్రీశైలం, భాను, లింగంను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అభినందించారు.

ఇదీ చూడండి:

అధికారుల "చెత్త" పని.. మనసులో పెట్టుకోవద్దన్న మేయర్!

ABOUT THE AUTHOR

...view details