అమరావతి రైతుల ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చుతున్న పరిస్థితుల్లో.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి 3 గంటల సమయంలో పోలీసులు తమ ఇళ్లలో తనిఖీలు చేశారని.. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెంలో అక్రమ అరెస్టులు చేశారని పలువురు రైతుల కుటుంబీకులు తెలిపారు. శివబాబు, నరేశ్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, నాయక్, వెంకటస్వామి పేరుగల ఏడుగురు రైతులను అరెస్ట్ చేశారని గ్రామస్థులు చెప్పారు. వారిని పోలీసులు తెనాలి రెండోపట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టకుంటే పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఏడుగురు రైతులు అరెస్ట్.. తెనాలికి తరలింపు - రాజధాని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తుళ్లూరులో తలపెట్టిన మహాధర్నాను నిర్వీర్యం చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా.. ఏడుగురు రైతులను వేకువఝామునే అదుపులోకి తీసుకున్నారు.
రాజధాని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు
Last Updated : Dec 29, 2019, 12:44 PM IST