వ్యాక్సినేషన్ వాయిదాకు పోలీసు ఉద్యోగసంఘాలు నిర్ణయించాయని.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పోలీసుల నిర్ణయానికి గర్విస్తున్నానని డీజీపీ గౌతంసవాంగ్ పేర్కొన్నారు. పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారన్న డీజీపీ... ఫ్రంట్‌లైన్ సిబ్బంది పోలీసులకు కరోనా టీకాలు చేయాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పోలీసులది కీలకపాత్రని... కేంద్రప్రభుత్వ కొవిడ్ పోర్టల్ ఆధారంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు.
పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు: డీజీపీ సవాంగ్ - DGP Sawang comments on covid vaccine
వ్యాక్సినేషన్ వాయిదాకు పోలీసు ఉద్యోగసంఘాలు నిర్ణయించాయని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. వారి నిర్ణయానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. నిమ్మాడ ఘటనలో పోలీసులపై వచ్చినవి ఆరోపణ అని డీజీపీ స్పష్టం చేశారు.
![పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు: డీజీపీ సవాంగ్ Police are facing several challenges: DGP Sawang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10459191-59-10459191-1612174150004.jpg)
Police are facing several challenges: DGP Sawang
వ్యాక్సినేషన్‌కు వెళ్లేవారు ఎన్నికల బాధ్యతలు వదిలి వెళ్లాలన్న డీజీపీ... ఎన్నికలకు రెండ్రోజుల ముందు నుంచీ పోలీసులు పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల దశలో పోలీసులుండే ప్రాంతం మారిపోతుందని తెలిపారు. నిమ్మాడ ఘటనలో పోలీసులపై వచ్చినవి ఆరోపణలేనన్న డీజీపీ సవాంగ్... టెక్కలిలో సీఐపై దాడి చేసిన వారిని అరెస్టు చేసామని వెల్లడించారు.
ఇదీ చదవండీ...నిమ్మాడ ఘటనపై ఎస్ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు