ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

REWARD ON ACCUSED: హత్యాచార నిందితుడిని పట్టిస్తే రూ. 10 లక్షలు

తెలంగాణలోని సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించి సంప్రదించేందుకు ఫోన్ నంబర్ల వివరాలను ప్రకటించారు.

10 lakh reword on rape Accused raju
10 lakh reword on rape Accused raju

By

Published : Sep 14, 2021, 8:36 PM IST

బాలికపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. తెలంగాణలోని సైదాబాద్‌ హత్యాచార నిందితుడిపై పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. సమాచారాన్ని 94906 16366 నంబర్‌కు లేదా 94906 16627 నంబర్‌కు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది.. ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు.

వైన్సుల ముందు...

నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్​ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే సాంకేతికత ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు. ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్​కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్​ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాంక్ బండ్ సహా ప్రతి పార్కును గాలిస్తున్న బృందాలు... రైల్వేస్టేషన్, బస్​స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్​లలో జల్లెడపడుతున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

మద్యం దుకాణాల వద్ద..

రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు సైదాబాద్, దిల్​సుఖ్​​నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకంట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు.

నాకేం తెల్వదు...

రాజు చేసిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం వీరిద్దరు తిరిగిన ప్రదేశాలలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తలను మాత్రం పోలీసు అధికారులు ఖండిస్తున్నారు.

ఉన్నతాధికారుల సమీక్ష..

చిన్నారి హత్యాచారం కేసులో పోలీస్​ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. అదనపు డీజీ శిఖాగోయల్, సంయుక్త సీపీ రమేశ్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తితో సీపీ అంజనీ కుమార్ సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లభించాయి..? కేసు ఎంత పురోగతి సాధించింది..? అన్న అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

TS MINISTER MALLAREDDY: 'ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్​కౌంటర్ చేయాలి..​ చేస్తం'

ABOUT THE AUTHOR

...view details