తెలుగుదేశం కార్యాలయాలపై దాడులకు(attack on TDP offices) నిరసనగా ఆ పార్టీ నేతలు చేపట్టిన రాష్ట్ర బంద్(state bandh)పై పోలీసులు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపారు. కృష్ణా జిల్లా(krishna district)లో అరెస్టులు, నిర్బంధాల పర్వం కొనసాగింది. గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, నందిగామ, కోడూరు, నాగాయలంక, నూజివీడు, మైలవరం, పెనుగంచిప్రోలు పరిధిలో పలువురు నేతలను అరెస్టు(arrest) చేసి స్టేషన్‌కు తరలించారు. కొన్నిచోట్ల పార్టీ శ్రేణులను ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ(devineni uma) ద్విచక్రవాహనంపై వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించేందుకు యత్నించగా... గొల్లపూడిలో అరెస్ట్ చేశారు. అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి నల్లపాడు స్టేషన్(nallapadu police station)కు తరలించారు. జిల్లాలో చాలాచోట్ల నిరసనకు వెళ్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చాలా మందిని గృహనిర్బంధం చేశారు. చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర(dhulipalla narendra)ను, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు(nakka anandh babu)ను గృహనిర్బంధం చేశారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు.(warning)
ఎక్కడికక్కడ గృహనిర్బంధం...
విజయనగరం జిల్లా(vizianagaram district) సాలూరు, చీపురుపల్లిలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP rammohan naidu), మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు(kala venkatrav) ఇంటి గేటుకు లీసులు తాళాలు వేశారు. విశాఖలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం(house arrest)లో ఉంచారు. పోలీసుల తీరుపై బండారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకు లోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్(kidari sravan kumar) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి.
ఉద్రిక్త పరిస్థితుల నడుమ...