Polavaram Canal: పోలవరం కుడి ప్రధాన కాలువ అధ్వానంగా మారింది. మట్టి, ఇసుక లోడు లారీలు నిత్యం కాలువ గట్టు మీద నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో లైనింగ్ ఎక్కడికక్కడ ధ్వంసమైంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి వద్ద కాంక్రీటు పలకలు కాలువలోకి జారిపోయాయి. గట్టు రెండడుగుల లోతు వరకు కోతకు గురైంది. లాకుల వద్ద చష్టా ధ్వంసమైంది. పట్టీసీమ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని కృష్ణాలో కలుపుతూ పోలవరం నుంచి పశ్చిమ గోదావరి వైపు గోదావరి నీరు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించే ఈ కాలువను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. గట్లపై లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలి.
Polavaram Canal: పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం - Polavaram Canal
Polavaram Canal: మట్టి, ఇసుక లోడు లారీలు నిత్యం కాలువ గట్టు మీద నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో పోలవరం కుడి ప్రధాన కాలువ అధ్వానంగా మారింది. గట్టు రెండడుగుల లోతు వరకు కోతకు గురైంది.
పోలవరం కాలువ గట్టుపై రాకపోకలు.. లైనింగ్ ధ్వంసం
Last Updated : Mar 28, 2022, 10:11 AM IST