ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడే రివర్స్ టెండరింగ్...ఎవరికీ దక్కెనో పోల'వరం' - రివర్స్ టెండరింగ్ ప్రక్రియ

పోలవరం నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు నేడు తెరలేవనుంది. స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రివర్స్ టెండరింగ్  మొదలు కానుంది. ప్రభుత్వం పిలిచిన రివర్స్ టెండర్లలలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే ఐబీఎం( ఇనీషియల్ బెంచ్ మార్క్) కంటే తక్కువ బిడ్​ను దాఖలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆ సంస్థకే ప్రభుత్వం టెండర్​ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.

నేడు రివర్స్ టెండరింగ్...ఎవరికీ దక్కెనో ఆ టెండర్లు

By

Published : Sep 23, 2019, 5:31 AM IST

నేడే రివర్స్ టెండరింగ్...ఎవరికీ దక్కెనో ఆ టెండర్లు

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం పనులకు సంబంధించి ఇవాళ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను జలవనరులశాఖ చేపట్టనుంది. స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కోసం 17వందల71కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణం కోసం 3వేల 216 కోట్లు అంచనా విలువ(ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువ)తో రివర్స్ టెండర్లు పిలిచింది. ఆగస్టు 17న నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఈ నెల 20 వరకు బిడ్​లు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. దాదాపు నెలరోజుల పాటు సమయం ఇచ్చినా... మేఘా ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థ ఒక్కటే బిడ్​ను దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ నిబంధనల ప్రకారం ఐబీఎం విలువ కంటే బిడ్ తక్కువుగా దాఖలైనప్పుడు మాత్రమే ఎల్-1గా ప్రకటించాల్సి ఉంటుంది. బిడ్డర్ ఒక్కరే ఉన్నందున టెండర్లకు సంబంధించి... ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనులకు రూ. 274 కోట్ల అంచనా విలువతో రివర్స్ టెండర్లు పిలిచిన ప్రభుత్వం.....ఈనెల 19న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించింది. హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా.... రూ. 231కోట్లకు టెండర్‌ దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details