ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

POLAVARAM AUTHORITY MEETING: పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ప్రారంభం..

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం.. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన హైదరాబాద్​లోని మాసబ్ ​ట్యాంక్ కేంద్ర జల సంఘం కార్యాలయంలో ప్రారంభమైంది.

polavaram-project-authority-meeting-started
ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం

By

Published : Nov 10, 2021, 1:40 PM IST

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకు కేంద్ర జల సంఘం కార్యాలయంలో ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామల రావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర ఇంజినీర్లు, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇతర ఇంజనీర్లు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో.. ప్రాజెక్టు పనుల పురోగతితోపాటు, డిజైన్ల ఖరారు, గతంలో గుత్తేదారుల నుంచి తొలగించిన పనులను మళ్లీ టెండర్లు పిలిచి అప్పగించడం.. తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కుడి కాలువ వైపు డిస్ట్రిబ్యూటరీల సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా ఇంకా తయారు కాలేదు. దీంతోపాటు నిర్వాసితులకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే, చేసిన పనులకు బిల్లుల చెల్లింపు.. పోలవరం వద్ద కొత్తగా ప్రతిపాధించిన ఎత్తిపోతల తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చూడండి:LIVE VIDEO : బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details