పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని తిరిగి చెల్లించడంలో.. కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇప్పటికే ఖర్చు చేసిన 2,234 కోట్ల నిధులు ఎప్పుడు వస్తాయోనని.. రాష్ట్రం ఎదురు చూస్తోంది. 2014 కంటే ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేంద్రం.. ఏఐబీపీ కింద మంజూరు చేసింది. అప్పటి నిధుల వ్యయానికి సంబంధించిన ఆడిట్ నివేదికల ఆధారంగానే కొత్త నిధులు మంజూరు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ కోసం వెచ్చించిన.. 283 కోట్ల రూపాయల బిల్లులకు సంబంధించిన రికార్డులు సమర్పించకపోవటంతో.. కొత్తగా ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసిన 2వేల 234 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయాయి. ముంపు మండలాల్లో ఖర్చుకు సంబంధించిన.. రికార్డులు అందుబాటులో లేకపోవటంతో ఆ వివరాలను.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేకపోతోంది. ఇదే సమయంలో 55వేల 548 కోట్ల రూపాయలతో సవరించిన అంచనాలను సాంకేతిక కమిటీ ఆమోదించినా.. కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖల నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భర్తీచేయటంలో కేంద్రం తీవ్ర జాప్యం - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని భర్తీ చేయటంలో కేంద్రం తీవ్ర ఆలస్యం చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన 2,234 కోట్ల నిధులు ఎప్పుడు వస్తాయోనని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. మరోవైపు 55 వేల కోట్లతో సవరించిన అంచనాలకు కేంద్ర ఆమోదాన్ని తెలియచేయాల్సి ఉంది.
polavaram funds