తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి(bhoodan pochampally news)కి అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా(bhoodan pochampally recognised as world tourist spot) ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది. డిసెంబరు 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో ఈ గ్రామం భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. తెలంగాణలోని పోచంపల్లితోపాటు మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, మేఘాలయాలోని కోంగ్‌తాంగ్ గ్రామాలు నామినేట్ అయ్యాయి. వీటిని పరిశీలించిన ఐరాస పర్యాటక సంస్థ(UNWTO).. పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక(pochampally recognised as world tourist spot) చేసింది.
పోచంపల్లి నేత శైలి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది: కిషన్ రెడ్డి