ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధుల్లో ‘న్యుమోనియా(Pneumonia Vaccine)’ ముఖ్యమైనది. మనదేశంలో ఈ వ్యాధి కారణంగా ఏటా ఐదేళ్ల లోపు పిల్లలు సుమారు 1.4 లక్షలమంది మృత్యువాతపడుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో.. ప్రతి ఆరుగురిలో ఒకరు న్యుమోనియా కారణంగానే మృతి చెందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
- ఇదీ చదవండి :ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణం నిషేధం!
న్యూమోకాకల్ కాంజుగేట్ టీకా
ఈ వ్యాధిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ(Pneumonia Vaccine))’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేటులో ఈ వ్యాక్సిన్‌ను ఒక్కో డోసుకు సుమారు రూ. 2,800- 3,800 వరకూ వసూలు చేస్తున్నారు. ఇంత ఖరీదైన ‘పీసీవీ’ టీకాను ఇప్పుడు సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యంలో ఉచితంగా అందజేయనున్నారు. న్యుమోనియా కారక మరణాలు అత్యధికంగా నమోదవుతున్న బిహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిని ప్రారంభించారు. తెలంగాణలో వచ్చే నెల రెండోవారం నుంచి ప్రభుత్వ వైద్యంలో ఈ టీకా(Pneumonia Vaccine)ను ప్రారంభించడానికి వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.
ఏటా 6.35 లక్షలమందికి లబ్ధి