ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృషికి, సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరు: మోదీ - భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వార్తలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా....ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కృషికి, సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరు అని కొనియాడారు.

andhra-pradesh-formation-day
ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు

By

Published : Nov 1, 2020, 11:31 AM IST

ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కృషికి, సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరు అన్న మోదీ... ఆంధ్రులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్రార్థిస్తున్నానని చెప్పారు.

ఏపీ అభివృద్ధి పథంలో సాగాలి: ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రప్రజలకు ఏపీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని....ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు.

మోదీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంది: అమిత్‌షా

ఏపీ ప్రజలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి ఏపీ చేసిన కృషి అపారమైనదని అమిత్‌షా ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండి:

సమస్యల సుడిగుండంలో పోలవరం ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details