ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఎంపీని పలకరించిన ప్రధాని మోదీ

పార్లమెంట్ సెంట్రల్ హాల్ వద్ద వైకాపా ఎంపీ రఘరామకృష్ణంరాజును... ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. రాజుగారూ బాగున్నారా..! అంటూ కరచాలనం చేస్తూ ఎంపీ భుజంతట్టారు. మరోవైపు ఈ ఆసక్తికర ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వైకాపా ఎంపీని పలకరించిన ప్రధాని మోదీ

By

Published : Nov 21, 2019, 5:01 PM IST

Updated : Nov 21, 2019, 5:46 PM IST

పార్లమెంటు ఆవరణలో ఆసక్తికర ఘటన జరిగింది. సెంట్రల్‌ హాల్‌ వద్ద వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని నరేంద్రమోదీ ఆప్యాయంగా పలకరించారు. ‘రాజుగారూ బాగున్నారా...!’ అంటూ ప్రధాని మోదీ కరచాలనం చేస్తూ... ఎంపీ భుజం తట్టారు. రాజ్యసభ నుంచి తన ఛాంబర్‌కు వెళ్తూ... సెంట్రల్‌హాల్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు పక్కనే ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు.

రాజకీయ వర్గాల్లో చర్చ!
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో చేసిన ప్రసంగం వివాదమయ్యింది. ఓవైపు ఏపీలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుంటే.. ఆయన తెలుగుకు అనుకూలంగా మాట్లాడటంపై పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అధినేత జగన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనను ప్రధాని మోదీ పలకరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. గతంలో వైకాపాలో పనిచేసిన రఘరామకృష్ణం రాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి భాజపాలో చేరారు. అనంతరం కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికలకు ముందు తిరిగి జగన్ గూటికి చేరి నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు.

ఇదీ చదవండి : కమల్​-రజనీపై అన్నాడీఎంకే 'టామ్ అండ్​ జెర్రీ' పంచ్

Last Updated : Nov 21, 2019, 5:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details