ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cash Prizes: గ్రామ పంచాయతీ, పరిషత్తులకు నగదు పురస్కారాలు అందజేయనున్న మోదీ - పరిషత్తులకు నగదు పురస్కారాలు అందజేయనున్న మోదీ

Cash Prizes: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ప్రకటించిన అవార్డులకు ఎంపికైన పంచాయతీలకు నగదు పురస్కారాలను ప్రధాని మోదీ జమ చేస్తారు. రాష్ట్రానికి సంబంధించిన 16 గ్రామ, మండల, జిల్లా పరిషత్తులు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి.

pm modi will present cash prizes to the selected panchayats
గ్రామ పంచాయతీ, పరిషత్తులకు నగదు పురస్కారాలు అందజేయనున్న మోదీ

By

Published : Apr 24, 2022, 7:41 AM IST

Cash Prizes: జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ప్రకటించిన అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తుల ఖాతాలకు నగదు పురస్కారాలను ప్రధాని మోదీ ఆదివారం బటన్‌ నొక్కి జమ చేస్తారు. జమ్ము కశ్మీర్‌లో నిర్వహించే గ్రామసభలో ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించిన 16 గ్రామ, మండల, జిల్లా పరిషత్తులు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. జడ్పీలకు రూ.50 లక్షలు, మండల పరిషత్తులకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షలు కేంద్రం అందజేయనుంది.

* జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లోనూ ఆదివారం సభలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి పంచాయతీలోనూ గ్రామసభలు ఏర్పాటు చేసి సుస్థిర, సమ్మిళిత ఆర్థిక, సామాజికాభివృద్ధే లక్ష్యంగా తీర్మానాలు చేయించాలని కమిషనర్‌ సూచించారు.

ఇదీ చదవండి: మూడేళ్లు సమీపిస్తున్నా అమలుకాని ‘పింఛను’ హామీ.. ఆందోళన చేస్తే నిర్బంధాలు..

ABOUT THE AUTHOR

...view details