'గారు' అంటే అర్థమేంటో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీ సహాధ్యాయులకు చెప్పారా అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని ప్రధాని మోదీ ఛలోక్తిగా అడిగారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీభాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ చదువుకుంటున్న వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.
కృష్ణా జిల్లా విద్యార్థి టోనీ మనోజ్ కుమార్‌తో మోదీ ఇలా ముచ్చటించారు.
- విద్యార్థి: నమస్కారం..
- ప్రధాని: నమస్కారం..మీ పేరేంటి. ?
- విద్యార్థి: టోనీ మనోజ్‌కుమార్ సార్
- ప్రధాని: నీ పేరు టోనీనా లేక మనోజ్‌కుమారా.?
- విద్యార్థి: నా పేరు టోనీ
- ప్రధాని: అయితే నీపేరు టోనీగారు అన్నమాట, ఝాన్సీలో ఉన్నవాళ్లకు గారు అంటే అర్థమేంటో చెప్పారా..?
- విద్యార్థి: చెప్పాను సార్........తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను సార్..?
- ప్రధాని: తెలుగులోనే మాట్లాడండి...బాగుంటుంది.
- ప్రధాని: నాకు బాగా అర్థమైంది...నేను ఆశీర్వదించేటంతటివాడిని కాదు. నేను మీ సహచరుడినే. మనమందరం కలిసి ప్రకృతి, పరమాత్ముడి ఆశీర్వాదం పొంది లక్ష్యాన్ని చేరుకోవాలి.