బిగ్‌బాస్-3 కార్యక్రమంపై హెకోర్టులో వ్యాజ్యం
బిగ్ బాస్-3 రియాలిటీ షోపై హైకోర్టులో పిల్ దాఖలైంది. బిగ్ బాస్ 3 ప్రసారాన్ని నిలిపివేయాలని కోరారు.
ఓ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ -3 రియాలిటీ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అశ్లీలత, అసభ్యత, హింస, నీతి రహిత చర్యలను ప్రోత్సహించేదిగా ఆ షో ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రసారాన్ని నిలువరించాలని కోరారు. కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా ప్రసారం చేయటం అసభ్యతను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. యువత, చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీల్లో ప్రసారం చేసే అసభ్యకరమైన కార్యక్రమాలను సెన్సార్ చేయాలన్సిన బాధ్యత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌పై ఉందన్నారు.