ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర నిధులను మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది’ - ఏపీలో నరేగా నిధులపై వార్తలు

ఉపాధి హామీ కింద 2018-2019 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లిస్తోందని హైకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని రుజువైతే.. ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

Pill in high court on narega funds
నరేగా నిధులపై హైకోర్టులో పిల్

By

Published : May 19, 2020, 1:46 PM IST

ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకుండా కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్ని మళ్లీంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుందని ధర్మాసనం ప్రశ్నించింది. నిధుల మళ్లింపు నిజమని తేలితే ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాలలో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్​కుమార్, జస్టిస్ కె. సురేశ్​రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

ఉపాధి హామీ పథకం కింద 2018-19 సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించడం లేదని పేర్కొంటూ గుంటూరు జిల్లా తెనాలి మండల అంగలకుదురు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ వి . భవాని , మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. బకాయిలు ముందుగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించిందని పిటీషనర్ తరపు న్యాయవాది వీరారెడ్డి వాదించారు. తాజాగా చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేందుకు మెమో జారీచేశారన్నారు . కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి : కరోనా వైరస్​ మన దుస్తులకు అంటుకుంటుందా?

ABOUT THE AUTHOR

...view details