తెలంగాణ మేడారంలో భక్తుల కోలాహలం - Pilgrims worshiping Medaram
తెలంగాణలో.. మేడారానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావటం వల్ల పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ... ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావటం వల్ల అమ్మవార్లను దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి గద్దెల వద్ద కోలాహలం కన్పిస్తోంది. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.