ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకంపై వ్యాజ్యం - విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకంపై హైకోర్టులో పిల్ న్యూస్

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకానికి సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రేస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకంపై వ్యాజ్యం
విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకంపై వ్యాజ్యం

By

Published : Sep 25, 2020, 4:05 AM IST

విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 23న జారీచేసిన 14 జీవోలను రద్దు చేయాలని న్యాయవాది నిమ్మిగ్రేస్​ వ్యాజ్యంలో కోరారు. నియామకం విషయంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంలోని సెక్షన్ 18లో పేర్కొన్న నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల సిఫారసుల ఆధారంగా సభ్యుల్ని నియమించారని ఆరోపించారు. కరోనా కాలంలో హడావుడిగా ఈ నియామకాలు జరిపారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యామండలి ఛైర్మన్, సభ్యులుగా నియమితులైన 51 మందిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details