ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేహౌండ్స్ భూమిలో అతిథి గృహ నిర్మాణం చట్టవిరుద్ధం: హైకోర్టులో పిల్ - రాష్ట్ర అతిథి గృహ నిర్మాణంపై హైకోర్టు ఉత్తర్వులు న్యూస్

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామ పరిధిలోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని రాష్ట్ర అతిథిగృహ నిర్మాణానికి ప్రభుత్వం తీసుకోవడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మరోవైపు రాష్ట్ర అతిథి గృహ నిర్మాణంపై హైకోర్టు జారీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

PIL in high court on kapuluppada State Guest House
PIL in high court on kapuluppada State Guest House

By

Published : Nov 22, 2020, 6:59 AM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామ పరిధిలోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల్ని రాష్ట్ర అతిథిగృహ నిర్మాణానికి ప్రభుత్వం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్‌ దాఖలుచేశారు. భూమి బదిలీ జీవోలను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే దాఖలైన ఓ వ్యాజ్యంలో అతిథిగృహం ప్రణాళికను సిద్ధం చేసి తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని గుర్తుచేశారు.

కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా, ప్రణాళిక సిద్ధం చేయకుండానే అధికారులు అక్కడ చెట్లను కొట్టేస్తూ భూమిని చదును చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 30 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా అధికారుల్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గ్రేహౌండ్స్‌ అదనపు డీజీపీ, విశాఖ జిల్లా కలెక్టర్‌, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై యథాతథస్థితి కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులుప్పాడలో అతిథి గృహం నిర్మాణం చేపడుతోందంటూ గుంటూరు జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాజధాని పనుల నిర్మాణాలు మినహా మిగతా పనులు విశాఖలో చేపట్టవచ్చంటూ ఉత్తర్వులు జారీచేసింది. అతిథి గృహ నిర్మాణ ప్రణాళికను తమ ముందు ఉంచాలని నవంబరు 2న ఇచ్చిన తీర్పులో హైకోర్టు కోరింది.

ఇదీ చదవండి:

'ప్రైవేటు ఆసుపత్రులపై పార్లమెంటరీ కమిటీ మండిపాటు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details