మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలపై హైకోర్టుకు ఫిర్యాదు - లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు న్యూస్
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని పిటిషన్ పేర్కొన్నారు. కార్యక్రమాల వీడియోలు, ఫొటోలు కోర్టుకు అందజేశారు. మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే శ్రీదేవిపై హైకోర్టులో అనుబంధ పిటిషన్ను న్యాయవాది ఇంద్రనీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైకాపాకు చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులపై లాక్‌డౌన్ ఉల్లంఘనలపై పిల్ దాఖలైంది. నోటీసులు జారీ అయ్యాయి.
pil filed on ysrcp mla's over violation of lock terms
Last Updated : May 19, 2020, 8:04 PM IST