ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించేందుకు టెలికమ్యునికేషన్ నిపుణులతో కేంద్ర విజిలెన్స్ కమిషనర్, సీబీఐ డైరెక్టర్ ద్వారా తక్షణం కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని పిటిషనర్ అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చండి.. హైకోర్టులో పిల్.. నేడు విచారణ - న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిల్ న్యూస్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాజకీయ ప్రోద్బలంతో ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల ఫోన్ నంబర్లు ట్యాప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మిగ్రేస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.`
PIL filed on phone tapping allegations in ap high court