విశాఖ గ్రేహౌండ్స్ స్థలంలో ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణం చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అతిథి గృహం బడ్జెట్, ప్లాన్ వివరాలు హైకోర్టు కోరినా ఇవ్వలేదని పిటిషనర్ పేర్కొన్నారు. గ్రేహౌండ్స్ భూమిలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఈ నిర్మాణంతో గ్రేహౌండ్స్ కమాండెంట్ రక్షణకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. గెస్ట్‌హౌస్ స్వార్థ ప్రయోజనాలకే గానీ ప్రజాప్రయోజనాలకు కాదని వ్యాజ్యంలో ప్రస్తావించారు.
విశాఖలో అతిథి గృహం చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో పిల్ - విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం తాజా వార్తలు
విశాఖలో ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణం చేపట్టడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గ్రేహౌండ్స్ స్థలంలో అతిథి గృహం నిర్మించటం చట్ట విరుద్ధమంటూ అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు కోర్టును ఆశ్రయించారు.
pil filed against on govt