ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధాని వ్యాజ్యాలపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయించండి' - ap high court on amaravathi news

అమరావతి వ్యవహారంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలపై... హైకోర్టులో పిల్ దాఖలైంది. వ్యాజ్యాల తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.

ap high court
ap high court

By

Published : Oct 15, 2020, 3:59 AM IST

రాజధాని అమరావతి వ్యహారంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎల్​ఎల్​ఎం అభ్యసిస్తున్న విజయవాడవాసి వేమూరు లీలాకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. అందువల్ల వాటి విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా కోర్టుపై బురద జల్లేందుకు వీల్లేకుండా చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details