తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ప్రాంతానికి చెందిన ఆత్రం జాలీంసాబ్‌ను నాలుగు రోజుల క్రితం ఎద్దు కడుపులో పొడిచింది. బంధువైన ఓ యువకుడి సాయంతో తల్లి సోలాబాయి.. బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి కొడుకును తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి మందులిచ్చారు.
లేవలేని స్థితిలో ఉన్న కుమారుడిని తల్లి ఆసుపత్రి గేటు పక్కనే నేలపై పడుకోబెట్టింది. అతనిపై ఎండ పడకుండా గేటుకు దుప్పటి కట్టి.. ఒక కొనను చేత్తో పట్టుకుంది. తల్లి ప్రేమకు ఎలా ఉంటుందో చూపించింది.