ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PG CET: అక్టోబర్​లో పీజీసెట్ పరీక్షల నిర్వహణ - pg cet schedule in ap

పీజీ సెట్-2021 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అక్టోబర్​లో జరగనుంది. ఉన్నత విద్యామండలి పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి దాకా విశ్వవిద్యాలయాల వారీగా పరీక్షలు జరుగుతుండగా.. ఇక నుంచి ఉమ్మడిగా నిర్వహించనున్నారు.

PG CET EXAMS
PG CET EXAMS

By

Published : Jul 6, 2021, 7:34 AM IST

పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021ను ఉన్నత విద్యామండలి అక్టోబర్​లో నిర్వహించనుంది. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాల వారీగా నిర్వహిస్తున్న ఈ పరీక్షను అన్నింటికీ కలిపి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షలు పూర్తి కానందున అక్టోబరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా, ర్యాంకులు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూలు మినహా మిగతా అన్ని వర్సిటీల్లోని పీజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. అన్ని వర్సిటీల్లో కలిపి 12వేల వరకు సీట్లు ఉండగా.. 50వరకు వివిధ రకాల కోర్సులున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో పరీక్ష నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details