రాజధాని నిర్మాణ ప్రణాళికను అమలు చేయాలని... అందులో భాగంగా అదనపు వర్షపు నీటి నిర్వహణకు కొండవీటి వాగు, పాల వాగు పనులను చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది స్పందన కోసం విచారణను గురువారానికి వాయిదా వేశారు. పాలవాగు, కొండవీటి వాగు వరద నివారణ పనుల్ని చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ... వెలగపూడికి చెందిన రాంబాబు, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.
కొండవీటి వాగు పనులపై హైకోర్టులో వ్యాజ్యం - కొండవీటి వాగు పనులపై హైకోర్టులో వ్యాజ్యం వార్తలు
కొండవీటి వాగు పనులు పూర్తి చేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తదపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.
![కొండవీటి వాగు పనులపై హైకోర్టులో వ్యాజ్యం pettion-in-high-court-on-kondaveeti-brook](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5187416-757-5187416-1574790742766.jpg)
pettion-in-high-court-on-kondaveeti-brook